సినిమా రివ్యూ: త్రిపుర
రేటింగ్ : 2/5
నటీనటులు: స్వాతి, నవీన్‌చంద్ర, రావు రమేష్
జనర్: హార్రర్, థ్రిల్లర్, కామెడీ
డైరెక్టర్: రాజ్ కిరణ్
నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్
సంగీతం: కమరన్
విడుదల : 06-11-2015 శుక్రవారం
టాలివుడ్, కోలీవుడ్ లలో మంచి ఫామ్ లో ఉన్న కలర్స్ స్వాతి తొలిసారిగా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. స్వామి రారా, కార్తికేయ వంటి చిత్రాల విజయంతో మంచి జోరు మీద ఉన్న కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘త్రిపుర’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో హార్రర్, కామెడీ జోనర్స్ కి ఆడియన్స్ నుంచి ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ‘గీతాంజలి’ సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలకు తగ్గట్టు త్రిపుర ఆడియన్స్‑ను ఆకట్టుకుందా.. ?
కధ
త్రిపుర (స్వాతి) ఒక పల్లెటూరిలో ఆనందంగా జీవితం గడిపే అమ్మాయి. ఇక తనకు కాబోయే భార్య ఎలా ఉండాలే ఊహించుకుంటూ కాలం గడుపుతున్న డాక్టర్ నవీన్ చంద్ర. అందుకు తగినట్టుగానే ఊహల్లో కాలం గడుపుతుంటాడు. ఒకానొక సమయంలో తన ఊహలకు తగ్గట్టుగానే కనిపించిన త్రిపురను చూసిన అతడు ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుని సిటీకి కాపురం కోసం తీసుకువస్తాడు. నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ రెంట్‌కు తీసుకుని అందులో నివాసం ఉంటారు. అనంతరం ఆ ఫ్లాట్‌లో దెయ్యం ఉందని తెలుసుకున్న ఆ జంట ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది? వారికి ఏమేం సమస్యలు ఎదురయ్యాయి? వీటన్నింటి నుంచి వారు ఎలా బయట పడ్డారు? అనేది ప్రేక్షకులు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్లు
స్వాతి
స్క్రీన్ ప్లే
కామెడీ
మైనస్ పాయింట్లు
రొటీన్ కథ
సంగీతం
బోర్ కొట్టించే కొన్ని సన్నీ వేశాలు
నటీనటుల పనితీరు
తొలి సారిగా టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ బ్యూటీ అందుకు తగ్గట్టుగా సినిమాను సక్సెస్ చేయటం కోసం అన్నిరకాలుగా కష్టపడింది. హీరోగా నటించిన నవీన్ చంద్ర తన పాత్ర మేరకు ఆకట్టుకున్నాడు పైగా కధ మొత్తం హీరోయిన్ మీద నడవటంతో అతను చేయటానికి ఏమి లేదు హీరోయిన్ ని ఫాలో అవ్వటం తప్ప. రావు రమేష్ తన మార్క్ నటనతో, తను సహజ సిద్దంగా చెప్పే దీర్గాలు తీస్తూ చెప్పే డైలాగ్స్ తో ఆకట్టుకోవటానికి ప్రయత్నించాడు. అయితే ఇప్పటికే ఈ జానర్‑లో చాలా సినిమాలు రావటంతో పెద్దగా కొత్తదనమేమి కనిపించలేదు. ఈ మద్య టాలీవుడ్ లో చిన్న నిర్మాతలకి హత కేక్ గా మారిన సప్తగిరి చేసిన కామెడీ వర్క్ అవుట్ కాలేదు. ఇటువంటి కామెడి సప్తగిరి ఇదివరికే చేసాడు, నవ్వు తెప్పించక పోగా రొటీన్ గా అనిపించింది.
సాంకేతిక నిపుణుల పని తీరు :
ప్రస్తుతం తెలుగు సినిమా హార్రర్, కామెడీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, ఇంతకు ముందు గీతాంజలి తీసి ఉన్నాడు కనుక దర్శకుడు త్రిపురను హార్రర్, కామెడీ జోనర్ లోనే తెరకెక్కించాడు. కాని ఆడియన్స్ ని మెప్పించటం లో విఫలం అయ్యాడు. ఇప్పటికే ఈ జానర్‑లో చాలా సినిమాలు రావటంతో పెద్దగా కొత్తదనమేమి కనిపించలేదు. సినిమాకు సంబంధించి కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఇక హార్రర్ సినిమాలకు ఆయువు పట్టుగా చెప్పుకునే నేపథ్య సంగీతం ఇందులో ఆశించిన స్థాయిలో లేదని
చివరి మాట : ట్రైలర్ చూసి మోసపోవద్దు

No comments:
Post a Comment