రేటింగ్ : 3.25/5
నిర్మాత : పరమ్ వి పొట్లూరి
సంగీతం : ఎంఎం కీరవాణి
నటీనటులు : అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్..
అనుష్క అంటే టాలీవుడ్ లేడీ బాక్స్ ఆఫీసు బాద్షా అని చెప్పాలి.. ఈ ఏడాది బాహుబలి, రుద్రమదేవి అనే రెండు పీరియడ్ ఫిల్మ్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అనుష్క ఈ సారి తెలుగు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టి నవ్విస్తూ ఓ మంచి విషయాన్ని చెప్పడానికి చేసిన సినిమానే ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి డైరెక్షన్ లో ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో చేసిన ఈ సినిమా ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ఈ ‘సైజ్ జీరో’ చూపిన వినోదమేంటనేది ఇప్పుడు చూద్దాం
కథేంటంటే…
స్వీటీ (అనుష్క) చిన్నప్పటి నుంచే బాగా లావు. తండ్రి (రావ్ రమేష్) చిన్నప్పుడే చనిపోతాడు. తల్లి, తాతయ్య పెంపకంలో పెరుగుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ…బరువు కూడా బాగా పెరుగుతుంది. ఓ హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తుంటుంది. అలా లావుగా ఉన్న స్వీటికి పెళ్లి చేయడం తల్లి రాజేశ్వరి (ఊర్వశి)కి భారంగా మారుతుంది. ఎన్ని సంబంధాలు వచ్చినా… లావుగా ఉందన్న కారణంతో క్యాన్సిల్ అయిపోతుంటాయి. చివరికి అభి (ఆర్య) సంబంధం ఓకే అవుతుందనుకుంటుంది. స్వీటీకి ఆభి నచ్చినప్పటికీ…పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నో అంటుంది. దీంతో అభి సిమ్రాన్ (సోనాల్ చౌహాన్) ప్రేమలో పడిపోతాడు. అభి చేస్తున్న పారిశుధ్యం అనే డాక్యుమెంటరీకి సిమ్రాన్ హెల్ప్ చేస్తుంది. సిమ్రాన్ యుకె ఎన్టీవోలో పనిచేస్తుంది. ఇండియాలో పనిచేసేందుకు వస్తుంది. అభితో పెళ్లి క్యాన్సిల్ అయినా… స్వీటీ ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తుంది. ఇంతలో ఓ ఎన్నారై సంబంధం స్వీటికి వస్తుంది. ఆ సంబంధం ఎలాగైనా కుదర్చాలని సైజీ జీరో అనే స్లిమ్మింగ్ సెంటర్లో జాయిన్ చేస్తుంది స్వీటి అమ్మ. సైజ్ జీరో ఓనర్ సత్యానంద్( ప్రకాష్ రాజ్). స్వీటీకి ఇష్టం లేకపోయినా… అమ్మ కోసం జాయిన్ అవుతుంది. అక్కడే తన స్నేహితురాలు జ్యోతి కూడా ఉంటుంది. అయితే అనుకోకుండా జ్యోతికి కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుంది. స్లిమ్మింగ్ సెంటర్లో ఇచ్చిన ఫ్యాట్ బర్నర్స్ వల్లే కిడ్నీ చెడిపోయిందని తెలుసుకుంటుంది స్వీటీ. అభి, సిమ్రాన్ తో పాటు అడవి శేష్ సహాయంతో సత్యానంద్ కు ఎలా బుద్ది చెప్పారనేది మిగిలిన కథ. మరో వైపు శేఖర్ (అడవి శేష్) స్వీటీని ఇష్టపడతాడు. ఇంతకూ స్వీటీ అభిని చేసుకుందా లేక శేఖర్ కు సై అందా అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్లో సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫార్మెన్స్
అనుష్క తానేంటో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది. తాను ఈ సినిమా కోసం బాగానే కష్టపడింది. వెయిట్ పెరిగి బాగా లావుగా కనిపించింది. చాలా చోట్ల లావుగా కనిపించేందుకు మేకప్ తో మేనేజ్ చేసినప్పటికీ… తాను లావెక్కాననే విషయం కనిపిస్తోంది. చాలా సన్నివేశాల్లో తనదైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. అక్కడక్కడ పంచ్ డైలాగ్స్ తో కామెడీ కూడా చేసింది. ఆర్యది రెగ్యులర్ హీరోయిజం చేసే పాత్ర కాదు. కేవలం అనుష్క పాత్రకు సపోర్టింగ్ రోల్ మాత్రమే. సోనాల్ చౌహన్ కూడా అంతే… సపోర్టింగ్ రోల్ లా ఉంటుంది. ఆర్య, సోనాల్ మధ్య ఓ లిప్ కిస్ కూడా ఉంది. బొడ్డు, తొడలు బాగా చూపించింది. అనుష్క తల్లిగా ఊర్వశి బాగా నటించింది. తనదైన విరుపుల డైలాగ్స్ తో నవ్వించింది. భరత్ అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేసాడు. ప్రకాష్ రాజ్ కి అలవాటైన పాత్రలో కనిపించాడు. బ్రహ్మానందం ఎప్పటిలాగే వెకిలి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. అడవి శేష్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. నాగార్జున, తమన్నా, జీవా, హన్సిక లాంటి స్టార్స్ కొద్ది సేపు సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేశారు. గొల్లపూడి మారుతి రావు తాత పాత్రలో మెప్పించాడు
టెక్నికల్ డిపార్ట్ మెంట్ పనితీరు.
ఈ చిత్రానికి కీరవాణి రీ రికార్డింగ్ ప్లస్ అయ్యింది. అయితే పాటలు అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. కీరవాణి పాటల్లోని మాధుర్యం వినిపించలేదు. ఓ రెండు పాటలు తప్ప చెప్పుకోదగ్గవి లేవు. నిరవ్ షా కెమెరా పనితనం బాగుంది. కథకు తగ్గట్టుగా లైటింగ్ బాగా సెట్ చేసుకున్నారు. డైలాగ్స్ అక్కడక్కడ బాగా పేలాయి.. కూతుర్ని అనుకున్నా.. కానీ కష్టాన్ని అని ఇప్పుడే తెలిసింది లాంటి డైలాగ్స్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నిర్మాత పివిపి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సెకండాఫ్ లో వచ్చే గ్రాఫిక్స్ కోసం బాగా కష్టపడ్డారు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
సమీక్ష
సినిమా ప్రారంభంలో అనుష్క, తండ్రి పాత్ర పోషించిన రావ్ రమేష్ మధ్య ప్రేమను బాగా చూపించారు. అయితే పేర్లు పడేలోపే…రావ్ రమేష్ చనిపోతాడు. ఆ తర్వాత అనుష్క పెళ్లికోసం పడే పాట్లు హిలేరియస్ గా ఉన్నాయి. అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్మే పాత్రలో అనుష్క ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేసింది. ఊర్వశి, అనుష్క, భరత్, ఆర్య మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. సినిమా ప్రారంభమైన ఓ అర్దగంట వరకు బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే సోనాల్ చౌహన్ ఎంటర్ అయిందో…అక్కడి నుంచి కథ డౌన్ పాల్ అయ్యింది. గ్రాఫ్ అమాంతం పడిపోయింది. అసలు ఆర్యను అనుష్క ఎందుకు వద్దంటుందో సరైన కారణాలు చూపించలేకపోయాడు దర్శకుడు. సోనాల్ మేకప్ కూడా సరిగ్గా లేకపోవడంతో చూడలేకపోయాం. మళ్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే ఉంది.
ఇక సెకండాఫ్ లో అయినా అనుష్క బరువు తగ్గించుకునేందుకు ఎన్ని పాట్లు పడుతుందో అని అనికుంటాం. కానీ.. కథ మొత్తం డైవర్ట్ చేశారు. జ్యోతి అనే క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ పెంచేశారు. ఆమెకు జరిగిన అన్యాయం గురించి పోరాడటం మొదలు పెట్టడం కథకు బాగా అడ్డంకిగా మారింది. సైకిల్ తొక్కి క్యాలరీస్ బర్న్ చేయాలనే సీన్స్ కథను మొత్తం చిందర వందర చేసేశాయి. సైకిల్ తొక్కితే క్యాలరీస్ బర్న్ అవడం… దానికి కార్పోరేట్ సంస్థవారు డబ్బులివ్వడం అనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా… కథలో భాగం కాకుండా సెపరేట్ ట్రాక్ లా అనిపిస్తుంది. ఆ సీన్స్ బాగా లెంగ్తీ అయ్యాయి. అనుష్క బరువు ఎలా తగ్గి పెళ్లి చేసుకుంది అనే కాన్సెప్ట్ ఉంటుందని ఊహిస్తారంతా.. దర్శకుడు ఆడియెన్స్ అంచనాలకు అందకుండా డిఫరెంట్ గా సెకండాఫ్ ను ప్లాన్ చేశాడు. అక్కడే పెద్ద తప్పు జరిగిపోయింది. తాను ఎంచుకున్న కథనంలో కామెడీ లేకపోవడం…కథ పక్కకెళ్లిపోవడంతో ఆడియెన్స్ కూడా మెల్లగా జారుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా… కామెడీని వదిలేసి సీరియస్ సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవ్వడంతో గందరగోళం ఏర్పడింది. అనుష్క ఫ్యాట్ తగ్గాల్సింది పోయి… సైజీ జీరో సత్యానంద్ పై పోరాటం మొదలు పెట్టడం సమంజసంగా లేదు. స్లిమ్మింగ్ సెంటర్స్ పై దర్శక నిర్మాతలకు ఉన్న కసిని సినిమా ద్వారా చూపించినట్టుగా అనిపిస్తుంది. గెట్ పిట్ డోంట్ క్విట్ అనే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఓ సినిమా చూస్తున్న ఫీలింగ్ మాత్రం రాదు. సెకండాఫ్ ఓ డాక్యుమెంటరీలా తయారైంది. మరుగుదొడ్లు, బాత్ రూమ్ లు, టాయిలెట్స్ గోల ఎక్కువైంది. పారిశుధ్యం కోసం జనాల్ని మేల్కొల్పడానికి హీరోయిన్ సోనాల్ చౌహాన్ తన బొడ్డు, తొడలు చూపించి కైపెక్కించే సన్నివేశం పరాకాష్ట. బ్రహ్మానందం, ఆలీ లాంటి క్యారెక్టర్లు కరివేపాకులా తయారయ్యాయి. రావ్ రమేష్ క్యారెక్టర్ ను కొద్దిసేపు ఉంచాల్సింది.
అనుష్క స్పెషల్ సాంగ్ కూడా కన్విన్సింగ్ గా అనిపించదు. నిజం నిరంజన్ గా పోసాని క్యారెక్టర్ వేస్ట్ అయ్యింది. ట్రైనర్ గా ఆలీ మెరుపులు లేవు. క్లైమాక్స్ కూడా రెగ్యులర్ గా ఉంది. అడవి శేష్ తో ఎంగేజ్ మెంట్… ఆర్యతో లేచిపోవడం లాంటివి చాలా చిత్రాల్లో వచ్చిన క్లైమాక్సే ఇది. దర్శకుడు మొదటి భాగాన్ని బాగా తీసుకెళ్లగలిగాడు. నవ్వ్వించాడు, ఏడిపించాడు. ఆలోచింపజేశాడు. కానీ సెకండాఫ్ ఏమైందో పూర్తిగా ట్రాక్ తప్పేశాడు. అతను మొదలు పెట్టింది ఒకలా..పూర్తి చేసింది మరొకలా.. ఆడియెన్స్ డిస్ కనెక్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది
ఫైనల్ గా…
అనుష్క కష్టం కోసం… పెర్ ఫార్మెన్స్ కోసం… మొదటి భాగం కోసం…కొన్ని మంచి విషయాల గురించి చెప్పినందుకు… ఓ సారి చూడొచ్చు….
స్వీటీ (అనుష్క) చిన్నప్పటి నుంచే బాగా లావు. తండ్రి (రావ్ రమేష్) చిన్నప్పుడే చనిపోతాడు. తల్లి, తాతయ్య పెంపకంలో పెరుగుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ…బరువు కూడా బాగా పెరుగుతుంది. ఓ హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తుంటుంది. అలా లావుగా ఉన్న స్వీటికి పెళ్లి చేయడం తల్లి రాజేశ్వరి (ఊర్వశి)కి భారంగా మారుతుంది. ఎన్ని సంబంధాలు వచ్చినా… లావుగా ఉందన్న కారణంతో క్యాన్సిల్ అయిపోతుంటాయి. చివరికి అభి (ఆర్య) సంబంధం ఓకే అవుతుందనుకుంటుంది. స్వీటీకి ఆభి నచ్చినప్పటికీ…పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నో అంటుంది. దీంతో అభి సిమ్రాన్ (సోనాల్ చౌహాన్) ప్రేమలో పడిపోతాడు. అభి చేస్తున్న పారిశుధ్యం అనే డాక్యుమెంటరీకి సిమ్రాన్ హెల్ప్ చేస్తుంది. సిమ్రాన్ యుకె ఎన్టీవోలో పనిచేస్తుంది. ఇండియాలో పనిచేసేందుకు వస్తుంది. అభితో పెళ్లి క్యాన్సిల్ అయినా… స్వీటీ ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తుంది. ఇంతలో ఓ ఎన్నారై సంబంధం స్వీటికి వస్తుంది. ఆ సంబంధం ఎలాగైనా కుదర్చాలని సైజీ జీరో అనే స్లిమ్మింగ్ సెంటర్లో జాయిన్ చేస్తుంది స్వీటి అమ్మ. సైజ్ జీరో ఓనర్ సత్యానంద్( ప్రకాష్ రాజ్). స్వీటీకి ఇష్టం లేకపోయినా… అమ్మ కోసం జాయిన్ అవుతుంది. అక్కడే తన స్నేహితురాలు జ్యోతి కూడా ఉంటుంది. అయితే అనుకోకుండా జ్యోతికి కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుంది. స్లిమ్మింగ్ సెంటర్లో ఇచ్చిన ఫ్యాట్ బర్నర్స్ వల్లే కిడ్నీ చెడిపోయిందని తెలుసుకుంటుంది స్వీటీ. అభి, సిమ్రాన్ తో పాటు అడవి శేష్ సహాయంతో సత్యానంద్ కు ఎలా బుద్ది చెప్పారనేది మిగిలిన కథ. మరో వైపు శేఖర్ (అడవి శేష్) స్వీటీని ఇష్టపడతాడు. ఇంతకూ స్వీటీ అభిని చేసుకుందా లేక శేఖర్ కు సై అందా అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్లో సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రానికి కీరవాణి రీ రికార్డింగ్ ప్లస్ అయ్యింది. అయితే పాటలు అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. కీరవాణి పాటల్లోని మాధుర్యం వినిపించలేదు. ఓ రెండు పాటలు తప్ప చెప్పుకోదగ్గవి లేవు. నిరవ్ షా కెమెరా పనితనం బాగుంది. కథకు తగ్గట్టుగా లైటింగ్ బాగా సెట్ చేసుకున్నారు. డైలాగ్స్ అక్కడక్కడ బాగా పేలాయి.. కూతుర్ని అనుకున్నా.. కానీ కష్టాన్ని అని ఇప్పుడే తెలిసింది లాంటి డైలాగ్స్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నిర్మాత పివిపి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సెకండాఫ్ లో వచ్చే గ్రాఫిక్స్ కోసం బాగా కష్టపడ్డారు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
సినిమా ప్రారంభంలో అనుష్క, తండ్రి పాత్ర పోషించిన రావ్ రమేష్ మధ్య ప్రేమను బాగా చూపించారు. అయితే పేర్లు పడేలోపే…రావ్ రమేష్ చనిపోతాడు. ఆ తర్వాత అనుష్క పెళ్లికోసం పడే పాట్లు హిలేరియస్ గా ఉన్నాయి. అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్మే పాత్రలో అనుష్క ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేసింది. ఊర్వశి, అనుష్క, భరత్, ఆర్య మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. సినిమా ప్రారంభమైన ఓ అర్దగంట వరకు బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే సోనాల్ చౌహన్ ఎంటర్ అయిందో…అక్కడి నుంచి కథ డౌన్ పాల్ అయ్యింది. గ్రాఫ్ అమాంతం పడిపోయింది. అసలు ఆర్యను అనుష్క ఎందుకు వద్దంటుందో సరైన కారణాలు చూపించలేకపోయాడు దర్శకుడు. సోనాల్ మేకప్ కూడా సరిగ్గా లేకపోవడంతో చూడలేకపోయాం. మళ్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే ఉంది.
అనుష్క కష్టం కోసం… పెర్ ఫార్మెన్స్ కోసం… మొదటి భాగం కోసం…కొన్ని మంచి విషయాల గురించి చెప్పినందుకు… ఓ సారి చూడొచ్చు….

No comments:
Post a Comment